Breaking News

ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్‌

Published on Tue, 09/17/2024 - 11:17

న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్‌ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్‌ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ నేడు అపాయింట్‌మెంట్‌ కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎల్జీతో  భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. అయితే ఎల్జీ ఎంతవేగంగా కేజ్రీవాల్‌ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే..  అతిషి సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనేదానిపై స్పష్టత వస్తుంది.

ఇక.. ఆప్‌ నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్‌ సతీమణి సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు అతిషి మర్లెనకు అవకాశం దక్కింది. లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లాక.. పాలన కుంటుపడకుండా అతిషీనే చూసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరుంది. ప్రస్తుతం ఆమె విద్యాశాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. 

కాగా ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో.. తిహార్‌ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మళ్లీ విజయం సాధించిన తర్వాతే సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్‌ ప్రకటించారు.  ‘ప్రజలు తమ తీర్పును ప్రకటించే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. 

ఇదీ చదవండి: రాజీనామా వ్యూహమిదే!

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)