Breaking News

‘మేం కూడా స్నేహితులమే.. మరి మీరు తమిళం నేర్చుకోండి’

Published on Sat, 06/28/2025 - 17:13

చెన్నై:  హిందీ భాష అనేది ఎవరికీ శత్రువు కాదని, ఆ భాషను స్నేహపూర్వకంగా దక్షిణాది రాష్ట్రాలు చూడాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీ కనిమొళి పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు.  తాము హిందీ నేర్చుకోవడం సంగతిని కాసేపు పక్కన పెట్టి, ఉత్తరాది వారు తమిళం నేర్చుకుంటే బాగుంటుందని కనిమొళి స్పష్టం చేశారు. అలాగైనా తమిళ భాష జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. 

‘మేం(తమిళులం) కూడా ఎవరికీ శత్రువులం కాదు.. మేం కూడా స్నేహితులమే. మా భాష కూడా అంతా నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా నార్త్‌ ఇండియన్స్‌ తమిళం నేర్చుకంటే బాగుంటుంది’ అని అమిత్‌ షా పేరును ప్రస్తావించకుండానే తనదైన శైలిలో పేర్కొన్నారు.

అంతకుముందు అమిత్‌ షా మాట్లాడుతూ.. హిందీ భాషను దేశంలోని ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలన్నారు. హిందీని ఎవరూ శత్రువుగా భావించొద్దని, అది ఏ భాషకు శత్రువు కూడా కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ‘త్రిభాషా పాలసీ’లో హిందీని తప్పనిసరి చేయడానికి చూడటాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు హిందీ భాషను తమ రాష్ట్రాల్లో రుద్దడాన్ని ఒప్పుకోవడం లేదు. 

ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్‌ సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు తమిళం ఉండగా హిందీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతోనే హిందీని తమిళనాడులో పాతాలని చూస్తున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి సైతం హిందీ భాషను తమ రాష్ట్రంలోకి తీసుకు రావడాన్ని ఖండించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)