Breaking News

ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేతగా బొత్స సత్యనారాయణ

Published on Wed, 08/21/2024 - 16:48

సాక్షి, గుంటూరు: విశాఖ జిల్లా స్థానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి ప్రతిపక్షనేతగా ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్రకార్యాలయం ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బొత్సకు ఆయన అభినందలు తెలిపారు.

విశాఖ జిల్లాలో జరిగిన స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. జడ్పీటీసీలు, ఎంపీటీసీల సహా స్థానిక సంస్థల సభ్యులందరూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నాయకత్వంపై విధేయత, విశ్వాసంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి బొత్సను గెలిపించారన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ గతిలేక అభ్యర్థులను కూడా పెట్టలేకపోయిందన్నారు.

ప్రస్తుతం పార్టీ కార్యాలయ బాధ్యతలతో పాటు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాసనమండలి ప్రతిపక్షనేతగా బొత్స సత్యనారాయణను నియమించాలని అధ్యక్షుడు ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ విషయంలో మరలా తనను ఆలోచించుకోమని చెప్పినప్పటికీ.. సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణనే నియమించాలని కోరామన్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్ధనను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆమోదించారని అప్పిరెడ్డి తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తాను వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటూ.. క్రమశిక్షణ కల్గిన కార్యకర్తల్లాగే పని చేశాన్నారు. తాను గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా  వైఎస్‌ జగన్‌ వలనే నియమితుడయ్యానన్నారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన వలనే వచ్చిందన్నారు.  అలాంటి అవకాశాలు వస్తూనే ఉంటాయని.. వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో పని చేయడానికి  ఎప్పుడూ ముందు ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)