Breaking News

వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు

Published on Sat, 07/12/2025 - 16:10

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీకి వేధింపులు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పోలీసులను పెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా.. ఓ కేసులో పీఎస్‌ విచారణకు హాజరైన ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టడంపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. 

సాక్షి, కృష్ణా జిల్లా: రాజకీయ కక్షలో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపైకి పోలీసులను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తుండడంపై ఆర్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు. పలు కేసుల్లో ఈ మధ్యే బెయిల్‌ మీద బయటకు వచ్చిన.. కోర్టు ఆదేశాలు మేరకు క్రైమ్ నంబర్ 142/25 మైనింగ్ కేసులో వంశీ విచారణ కోసం గన్నవరం పీఎస్‌కు వెళ్లారు. 

మధ్యాహ్నాం 12గం. సమయంలో ఆయన స్టేషన్‌కు వెళ్లి విచారణ కోసం సంతకాలు చేశారు. అయితే అప్పటికి విచారణ అధికారి రాలేదు. గత నాలుగు రోజులుగా వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కాస్త త్వరగా విచారించి వంశీని పంపించాలని ఆయన అనుచరులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.అయితే అధికారి రానిది తామేమీ చేయలేమని కిందిస్థాయి సిబ్బంది చెప్పారు. అలా.. 

మూడు గంటలు గడిచింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఆయన పీఎస్‌లో బెంచీపై అలా కూర్చుని ఉండిపోయారు. చివరకు అధికారి ఇవాళ రాడని.. మళ్లీ విచారణ ఎప్పుడనేది లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ పరిణామంతో ఆయన అనుచరులు ఒకింత అసహనానికి గురయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వంశీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఆ సమయంలో వంశీ వారిని సముదాయించారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఆస్పత్రికి వెళ్లారాయన. 

Gannavaram Police Station: వల్లభనేని వంశీ లేటెస్ట్ విజువల్స్

ఇదీ చదవండి: ఇంత అణచివేతనా? ఇది పోలీసుల రాజ్యమా? లేక..

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు