Breaking News

హెరిటేజ్ పాల కంటే విశాఖలో భూమి ధర తక్కువ: కన్నబాబు

Published on Wed, 01/21/2026 - 14:31

సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కూటమిగా ముఠా కట్టి.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. హెరిటేజ్‌ పాల ప్యాకెట్‌ కంటే భూమి ధర ఎలా తక్కువగా ఉందని ప్రశ్నించారు. 

వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి నేతలు ప్రజలను సూపర్ మోసం చేశారు. చంద్రబాబు సమర్థవంతంగా అమలు చేస్తున్న పథకం ఒక్కటే. ప్రైవేటు వాళ్లకి దోచిపెట్టడం. హెరిటేజ్ పాల ప్యాకెట్ కంటే విశాఖపట్నంలో ఎకరా భూమి ధర తక్కువ. సామాన్యులను వదిలేసి కార్పొరేట్ల కోసం పనిచేసే వాళ్ళని దావోస్ మ్యాన్‌ అంటారు. దావోస్‌లో కూటమి నేతలు కలరింగ్‌ ఇస్తున్నారు.

భూములు ప్రజా సంపద. చంద్రబాబు.. విశాఖ భూములు ఏమైనా మీ బాబు గారి సొమ్మా?. భూములున 99 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి?. విశాఖపట్నం భూములు పప్పు బెల్లాల్లా పంచుతున్నారు మరి అమరావతి భూములు ఎందుకు ఇవ్వరు?. చెప్పింది ఆచరించటం, చేసేదే చెప్పడం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సిద్ధాంతం. మాట నిలబెట్టుకోవడం కోసం కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేశారు. కూటమి ముఠా చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారు. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)