Breaking News

‘పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడు, అప్పుడు నాకు అన్యాయం జరగలేదా?’

Published on Sun, 10/29/2023 - 19:36

సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా:  కాంగ్రెస్‌ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవి వదులుకుంటానని  కూచకుళ్ళ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన కూచుకుళ్ల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా  సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యలను పట్టించుకోవడంతోనే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు కూచుకున్న ప్రకటించారు.

మరోవైపు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే కాంగ్రెస్‌ నాగర్‌ కర్నూల్‌ టికెట్‌ ఖరారు చేయడంతో  నాగం జనార్ధన్‌ రెడ్డి హస్తం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూచుకుళ్ల ఆదివారం మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్‌లో గెలుపు సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. 1998-2018 వరకు 20 ఏళ్లపాటు తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు.

2018లో అధికారం కోసం ఆశపడి పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడని నాగంను ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఆ రోజు తనకు అన్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. నాగం నడవలేడు, మెట్ల ఎక్కలేడ కానీటికెట్ కావాలని పట్టుబట్టాడని మండిపడ్డారు. నిన్నటి వరకు నాగం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్‌, ప్రాజెక్టులపై కేసులు వేశాడని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిత్యం తిట్టిన పార్టీలోనే నేడు చేరుతున్నాడని విమర్శించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)