Breaking News

‘కాళేశ్వరం కమిషన్ నివేదిక ట్రాష్, గ్యాస్’

Published on Tue, 08/05/2025 - 16:36

సాక్షి,న్యూఢిల్లీ: ఈవీఎంలు వద్దు పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల నిర్వహణ, సంస్కరణలపై అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈసీ సమావేశానికి బీఆర్‌ఎస్‌ నుంచి కేటీఆర్‌తో పాటు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసీతో సమావేశం అనంతరం, కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

‘పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. బీహార్ ఎన్నికల నుంచే పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికల జరపాలి. ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బాండ్ పేపర్లతో ప్రజలను వంచించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే ప్రజలు శిక్షించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. హామీలు నెరవేర్చకపోతే సభ్యత్వం రద్దు చేయాలి. బీహార్ ప్రత్యేక ఓటర్ సవరణ పై కూడా చర్చ జరిపాం. ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తీసేయలేదు అని ఎన్నికల సంఘం చెప్పింది. ఓటరు జాబితా సవరణ మంచిదే కానీ అందరి విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని చేయాలి. అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.

అదే సమయంలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చించేందుకు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక  ట్రాష్, గ్యాస్. కాళేశ్వరం కమిషన్ నివేదికలో 650 పేజీల్లో ఉన్న నివేదికను 60 పేజీల్లోకి కుదించి అసెంబ్లీలో పెడతామని అంటున్నారు.అసెంబ్లీలో మైకు కట్ చేయకుండా ఉంచితే కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతాం.దురుద్దేశంతో మాపై  ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్ ,బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం. మొత్తం నివేదికను బయట పెట్టాలి.అసెంబ్లీలో నివేదిక పెట్టాలి.బీసీల కు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదు. సబ్ ప్లాన్ ఎందుకు పెట్టరు. మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చెయ్యండి. ఢిల్లీలో డ్రామా లు చేస్తే ఎవ్వరు నమ్మరు’అని ఎద్దేవా చేశారు.  

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)