Breaking News

తెలంగాణ తల్లిని అవమానిస్తారా? కేటీఆర్‌

Published on Mon, 09/16/2024 - 10:27

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్‌ సర్కార్‌  తెలంగాణ తల్లిని ఆవమానిస్తోందని ధ్వజమెత్తారు .తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన, స్వార్థ రాజకీయాలకు తెరతీస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఎ క్స్‌ వేదికగా  స్పందిస్తూ..

‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?

తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?

నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. 
“తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..
“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??

తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..!

జై తెలంగాణ’ అంటూ  పేర్కొన్నారు. కాగా స‌‌‌‌‌‌‌‌చివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మొదటి నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంది.తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గతంలోనే తేల్చిచెప్పారు. 

సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మృతి చిహ్నం పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ఆ స్మృతి చిహ్నం ప్రారంభోత్సవ సభలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని తెలిపారు. అందుకోసం సచివాలయం ముందున్న సిగ్నల్‌ పాయింట్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మార్చి రోడ్డును వెడల్పు వేసిందని పేర్కొన్నారు. ప్రజలు పండుగ సంబురాల్లో ఉండగా విగ్రహావిష్కరణకు పూనుకోవడంలో ఆంతర్యం ఏమిటని  ప్రశ్నించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)