Breaking News

పావు వంతు రైతులే అర్హులా?

Published on Fri, 07/19/2024 - 05:57

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ పేరిట రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభు త్వం రైతాంగాన్ని మరో మారు మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. రైతుబంధు కింద జూన్‌లో రైతులకు ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి రూ.7 వేల కోట్లను రుణమాఫీ కోసం దారి మళ్లించిందని కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తాన్ని విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లుగా పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

 40 లక్షల మంది రైతులు లక్ష రూపాయల రుణం తీసుకుంటే 11 లక్షల మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులే అర్హత సాధించారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం 2014లోనే రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు రూ. 16,144 కోట్లు వెచి్చంచి.. సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి 
ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై పోలీసు సి బ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయా  లని కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో కోరారు. ఓ వాహనదారుడిని పోలీసులు దుర్భాషలాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడాన్ని ప్రస్తావిస్తూ దీన్ని పోస్ట్‌ చేశారు. పౌరుడిపై పోలీసులు వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసు శాఖ, డీజీపీకి ఇది అంగీకారయోగ్యమైన భాషేనా అని ప్రశ్నించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)