Breaking News

ఈట‌ల‌ గెలుపుపై మ‌ల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్‌

Published on Sat, 04/27/2024 - 17:21

సాక్షి, హైదరాబాద్‌: మ‌ల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌బోతున్నార‌ని ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయం అనుభవంతోనే ఈట‌ల‌పై ఆ కామెంట్స్ చేశార‌ని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈట‌ల రాజేంద‌ర్‌ను మున‌గ చెట్టు ఎక్కించి కింద ప‌డేయాల‌నేది ఆయన వ్యూహ‌మ‌ని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల  విష‌యంలో మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని చాటుకున్నార‌ని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగ‌మ‌వుతున్నార‌ని, ఆయన వ్యాక్యాలు సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపారు.  మ‌ల్కాజ్‌గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్‌కు కూడా తెలుసన్నారు. 

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్‌. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్‌ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్‌ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు.  2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్‌ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు.  
చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు

‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.

2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ.  ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.

కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం.  ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)