Breaking News

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి.. కేటీఆర్‌ రియాక్షన్‌

Published on Sat, 11/09/2024 - 17:12

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడిని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు. ‘‘ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు దాడి చేశారు. ప్రశ్నిస్తే దాడి చేయడం ఇందిరమ్మ రాజ్యమా?.’’ అంటూ ఆయన మండిపడ్డారు.

పెద్దల మెప్పు కోసం పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తే మేం వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామంటూ ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి అంటే రేవంత్‌కు భయం పట్టుకుందని.. తాటాకు చప్పుళ్లకు బీఆర్‌ఎస్‌ భయపడదు’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్‌రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)