Breaking News

మీ ఏడుపే మా ఎదుగుదల.. కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

Published on Tue, 07/02/2024 - 09:42

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఎంత చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టారు. గోదావరి జలాలను రైతులకు అందించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తాజాగా కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. 
మా కరువులకు కన్నీళ్ల కు
శాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!

తెలంగాణ తెర్లై పోతే సంకలు 
గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు
ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన 
మా వరప్రదాయిని  కాళేశ్వరం!

తలాపున గోదారి గలగల పారుతున్న
తనువంతా ఎడారై ఎండిన శాపానికి
విమోచనం కాళేశ్వరం!

సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న 
మా చేను చెలకలు నదీ జలాలతో 
తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం..!

దగాపడ్డ నేల దశాబ్దాలుగా  జరిపిన 
గోదారి జలాల సాధన 
పోరాటాలకు సమాధానం కాళేశ్వరం!

శిథిల శివాలయంగా పాడుబడిపోయిన
శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవమిచ్చిన
పుణ్య వరం కాళేశ్వరం!

నీళ్లు రాక..ఒట్టిపోయిన నిజాంసాగర్ కు
నిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం!

మండుటెండల్లో చెరువులను మత్తళ్లు
దూకించిన మహత్యం కాళేశ్వరం!

మా తపనకు..ఆలోచనకు ..అన్వేషణకు
జలదౌత్యానికి... నిదర్శనం కాళేశ్వరం..!

కాళేశ్వరం అంటే ఒక్క  బరాజ్  కాదని 
తెలియని మీ అజ్ఞానం!

ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం
సరిదిద్దుకోగలం...!

రాజకీయ కుళ్ళు కుతంత్రాలను 
దిష్టి చూపులను తట్టుకోగలం..!

మీ ఏడుపే మా ఎదుగుదల..!

#KaleshwaramProject అని కామెంట్స్‌ చేశారు. 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)