Breaking News

రుణమాఫీపై సమాధానం చెప్పే దమ్ము సీఎం రేవంత్‌కు లేదు: కేటీఆర్‌

Published on Thu, 08/22/2024 - 13:57

సాక్షి, రంగారెడ్డి: రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే రుణమాఫీపై తమ ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.

కోతలు లేకుండా రూ. 2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా చేవెళ్లలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ధర్నాలో కేటీఆర్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్‌ అనేక హామీలు ఇచ్చారని, ఒక్క సంతకంతో డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని అనేక దేవుళ్లపై ఒట్లు పెట్టిన సీఎం రేవంత్‌.. రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

రుణమాఫీ చేయకుండా దైవద్రోహానికి పాల్పడ్డారని కేటీఆర్‌ విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై ప్రశ్నిస్తే తమనే దబాయించారని, సభలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఏడిపించారని అన్నారు. రుణమాఫీ, హామీలపై సమాధానం చెప్పే దమ్ము సీఎం రేవంత్‌కు లేదన్నారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)