Breaking News

క్షమాణలు చెప్పాకే మోదీ వరంగల్‌లో అడుగు పెట్టాలి: కేటీఆర్‌

Published on Fri, 06/30/2023 - 16:06

సాక్షి, మహబూబాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర పునఃర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాణలు కోరిన తర్వాతే  వరంగల్‌లో అడుగుపెట్టాలని అన్నారు. ములుగులో రాష్ట్ర ప్రభుత్వం 360 ఎకరాల భూమి కేటాయించినప్పటికీ.. గిరిజన యూనివర్శిటీకి ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు.

మహబూబాబాద్‌లో జరిగిన పోడు భూముల పట్టాల పంపిణీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరు, బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి రిపేర్ సెంటర్ మంజూరు చేయడం సరైంది కాదన్నారు. రైళ్లు తయారీ చేసే ఫ్యాక్టరీనీ గుజరాత్‌కు తరలించి.. రిపేర్ సెంటర్ కాజీపేటకు ఇవ్వడం వివక్షకు గురిచేయడమేనని మండిపడ్డారు. వీటన్నిటికీ జవాబు చెప్పిన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చదవండి: గిరిజనులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌.. ఆ కేసులు రద్దు!

కాగా పోడు భూములకు పట్టాలు మాత్రమే కాకుండా.. రైతు బంధు, రైతు బీమా కూడా అందుతుందని కేటీఆర్‌ అన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా వర్తిస్తుందని చెప్పారు. జిల్లాలో 24,281 మంది రైతులకు 67,730 ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)