Breaking News

రేవంత్‌,బండి సంజయ్‌ రహస్య మిత్రులు: కేటీఆర్‌

Published on Mon, 10/21/2024 - 17:14

సాక్షి,హైదరాబాద్‌: సీఎం రేవంత్,బండి సంజయ్‌లు రహస్య మిత్రులని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌  ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సోమవారం(అక్టోబర్‌ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్‌కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.

‘రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.

మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్‌ఎస్‌కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

గ్రూప్‌ వన్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..

‘గ్రూప్‌ వన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్‌పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో‌ 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: కేటీఆర్‌ ఇంటివద్ద భారీగా పోలీసులు 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)