Breaking News

ఊరించి.. కంటతడి పెట్టించారు!

Published on Sat, 07/20/2024 - 05:08

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీపై రైతులను ఏడు నెలలుగా ఊరించి, చివరకు కంటతడి పెట్టించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. ‘చారాణ కోడికి.. బారాణా మసాలా’అనే సామెతను తలపించేలా రుణమాఫీపై ప్రభుత్వం తీరు ఉందన్నారు. అర్హత ఉన్నా అనేక మంది రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదో చెప్పే నాథుడు లేడని, రైతుల గోడు వినేవారే లేరని అన్నారు. రుణమాఫీ జరగని అర్హులైన రైతులు ఓ వైపు ఆందోళనలో ఉంటే, సంబురాలు ఎందుకని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ ప్రశ్నించారు.

40 లక్షల మంది లబ్ధిదారుల్లో 30 లక్షల మంది రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వ్యవసాయ సీజన్లు కావస్తున్నా రైతు భరోసాను ప్రారంభించలేదన్నారు. రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు వంటి హామీలను అమలు చేయకుండా మభ్య పెడుతోందన్నారు. ఇంతకాలం ప్రజల దృష్టిని మళ్లించిన రేవంత్‌ ప్రభుత్వం, ప్రస్తుతం నిధుల దారిమళ్లింపునకు పాల్పడుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు.

పేదరిక నిర్మూలనలో రెండో స్థానం
కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో పేదరిక నిర్మూలనలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని కేటీఆర్‌ అన్నారు. నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీ) లెక్కలే దీనికి నిదర్శనమన్నారు. పదేళ్లపాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్‌ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.

2020–21తో పోలిస్తే 2023–24 (ఎస్‌డీజీ)లో 74 స్కోర్‌తో తెలంగాణ ముందుందని చెప్పారు. అంతకుముదు 2020 –21తో పోలిస్తే ఐదు పాయింట్లు మెరుగైందన్నా రు. చాలారంగాల్లో తెలంగాణ సాధించిన మా ర్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై పెట్టే దృష్టి.. రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)