Breaking News

పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా?: కేటీఆర్‌

Published on Fri, 09/13/2024 - 04:58

సాక్షి, హైదరాబాద్‌:  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసి.. పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటం దారుణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇంతకు మించి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. 

‘‘పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్‌ ఆర్డర్‌ ఉందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వం దాడి చేయించటమే ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనా?’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చేస్తున్న అరాచకాలను కచి్చతంగా రాసి పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. అరికెపూడి ఇంటికి వెళ్తానన్న కౌశిక్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. అరికెపూడిని మాత్రం కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.

వందల మంది కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేశారంటే పక్కాగా ముందస్తు ప్లాన్‌ ప్రకారమే దాడి చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధగా ఉందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన దాడేనని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న కౌశిక్‌రెడ్డిని ప్రభు త్వం టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. కావాలనే అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తోందని  విమర్శించారు. 

బీఆర్‌ఎస్‌ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు.. 
‘‘సీఎం రేవంత్‌రెడ్డీ.. మా పార్టీ సైనికుల పోరాటాని కి నీకు నచ్చిన పేరు పెట్టుకో. కాంగ్రెస్‌ గూండాల దౌర్జన్యాలు, దాడులు బీఆర్‌ఎస్‌ సైనికుల స్థైర్యాన్ని ఇసుమంత కూడా దెబ్బ తీయలేవు. తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని మీ అవినీతి, దుర్మార్గ పాలన నుంచి కాపాడుకుంటాం. కౌశిక్‌రెడ్డితో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు..’’అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి