కర్ణాటకలో ఆపరేషన్‌ లోటస్‌.. మాజీమంత్రి షాకింగ్‌ కామెంట్స్‌

Published on Sun, 09/03/2023 - 19:12

బెంగళూరు: ఇటీవల కర్ణాటక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీపై కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నో ప్లాన్స్‌ చేస్తూ ముందుకుసాగింది. కానీ, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో హస్తం పార్టీ గెలుపు ఖాయమైంది. ఇక, తాజాగా కర్ణాటక రాజకీయాలపై బీజేపీ మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్‌ చేశారు. 

అయితే, మాజీ మంత్రి ఈశ్వరప్ప ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్‌ సిద్ధమైనట్టు తెలిపారు. కర్ణాటకలో ఆప‌రేష‌న్ లోట‌స్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని, 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండ‌ద‌ని హాట్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో స‌గం మంది హ‌స్తం గూటికి చేర‌తార‌ని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కానీ.. ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేర‌బోర‌ని స్ప‌ష్టం చేశారు. ద‌మ్ముంటే నెల‌రోజుల్లోగా క‌నీసం ఒక్క ఎమ్మెల్యేను ఆక‌ర్షించాల‌ని ఆయ‌న కాంగ్రెస్‌కు స‌వాల్ చేశారు. తమ సొంత ఎమ్మెల్యేల‌కే మీపై న‌మ్మ‌కం లేద‌ని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని చురకలంటించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్‌ ఈశ్వరప్పకు టికెట్‌ ఇవ్వలేదు. అనంతరం, ప్రధాని మోదీ.. ఈశ్వర్పకు కాల్‌ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్‌.. ఏమన్నారంటే?

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)