Breaking News

‘తప్పు చేస్తున్నావ్‌ షర్మిలా’

Published on Thu, 04/11/2024 - 19:27

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికే వైఎస్‌ అని పేరుపెట్టుకుని ప్రజల ముందుకు వస్తే తమలాంటి అభిమానులు వదిలిపెట్టరని, తస్మాత్‌ జాగ్రత్త అంటూ ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలను హెచ్చరించారు వైఎస్సార్‌టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి. వైఎస్సార్‌జిల్లాలో పర్యటిస్తున్న  కొండా రాఘవరెడ్డి..  షర్మిలపై మండిపడ్డారు.  వైఎస్సార్‌ కుటుంబాన్ని చీల్చే కుట్రలను ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్‌ అభిమానిగా షర్మిల చర్యలు తమనెంతో  బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఏ ఫుట్‌పాత్‌పై తిరిగినా మాకు అభ్యంతరం లేదు. మేము రాజశేఖర్‌రెడ్డి గారి వీరాభిమానులము. రాజశేఖర్‌రెడ్డిగారంటే మాకు ప్రాణం. రాజశేఖర్‌రెడ్డిగారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే.. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో  పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము.  మాలాంటి వారు లక్షలమంది తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికి వైఎస్‌ అని పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నావ్‌ చూడు.  మా లాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు తస్మాత్‌ జాగ్రత్త అని చెప్పడానికే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి కడప ప్రజలను జాగృతం చేస్తున్నాం.

అక్కడ ఉన్నప్పుడు(తెలంగాణలో) ఆడ(అక్కడ) బిడ్డ అని అంటివి. ఇక్కడకొచ్చి(ఏపీ) ఈడ బిడ్డ అంటివి. దానికోసం సామెతలు. రక్తసంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్‌ కట్టాల్సిన అన్నకు నువ్వు రాక్షస రూపంలో ఆయన స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలివో మాకు అర్థమైతాంది.నేను ఇవాళ జగన్‌మోహన్‌రెడ్డిగారిని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కాపాడుకోవాలి. ఏం తప్పు చేసిండు జగన్‌మోహన్‌రెడ్డిగారు. నీకు ఏమి ఎరుక.  చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్‌ చదవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావా?

నీకు తెలుసా నాడు-నేడు, తెలుసా నీకు అమ్మ ఒడి, తెలుసా నీకు గోరుముద్ద. ఏం తెలుసు నీకు. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్నప్పుడు 850 రుగ్మతలు ఆరోగ్య శ్రీలో ఉంటే, ఈరోజు రెండు వేల ఐదువందల రుగ్మతలను ఆరోగ్య శ్రీలో పెట్టిన మహానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిగారు. నీది నాలుకనా.. తాటిమట్టనా? అని అడగదల్చుకున్నాం. ఏ కోశాన కూడా వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి కూతురిగా అంగీకరించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తెలుసుకో షర్మిలా.

నువ్వు మురుసుపల్లి షర్మిలవు. నువ్వు మురుసుపల్లి అనిల్‌కుమార్‌ భార్యవు. అసలు నీకు ఏం కావాలి. నీకు ఆశ ఎక్కువ. ఆశయం మాత్రం లేదు. ఓర్వలేని తనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? అని ధ్వజమెత్తారు కొండా రాఘవరెడ్డి.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)