Breaking News

నాలుగైదు సార్లు ఓడిపోయిన వారితో నేను కూర్చోవాలా?: కోమటిరెడ్డి ఫైర్‌

Published on Thu, 01/12/2023 - 11:05

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా మాణిక్‌రావు థాక్రే ప్లాన్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలో మాణిక్‌రావుతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ‍అయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్ల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం సమావేశమయ్యారు. 

​కాగా, వీరి భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఏఐసీసీ షోకాజ్‌ నోటీసులు చెత్త బుట్టలో పడ్డాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరిగింది. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోను. నాలుగైదు సార్లు ఓడిపోయిన వారితో నేను కూర్చోవాలా?. మా ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తే ఏఐసీసీ పట్టించుకోలేదు.  నా ఫొటో మార్ఫింగ్‌ చేశారని స్వయానా సీపీనే చెప్పారు. బిజీగా ఉండటం వల్లే బుధవారం గాంధీభవన్‌కు రాలేదు. మరి.. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు రాలేదు. వాళ్లు రాలేదని ఎందుకు అడగరు?. నియోజకవర్గంలో పనుల కారణంగా బుధవారం థాక్రేను కలవలేకపోయాను’ అని స్పష్టం చేశారు. 

ఇక, వీరి మధ్య గంటకు పైగానే చర్చ సాగింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ ప్రచారంపై చర్చించినట్టు సమాచారం. వైఎస్‌ షర్మిల, టీడీపీ అధినేత చంద్రబాబు అంశాలపై కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి.. కాంగ్రెస్‌ నేతలు కేవలం వైఎస్‌ షర్మిలపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఎందుకు విమర్శించడంలేదని ప్రశ్నించారు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)