Breaking News

‘నన్నే దుర్భాషలాడుతూ’.. సీఎం రేవంత్‌కు మంత్రి కోమటిరెడ్డి లేఖ

Published on Tue, 11/25/2025 - 21:07

సాక్షి,నల్గొండ: జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ పదవి చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీ అంతర్గతంగా కలహాలు మొదలయ్యాయి.

పున్నా కైలాష్ తనపై, తన కుటుంబంపై అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి.. అలాంటి వ్యక్తికి డీసీసీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డీసీసీ పదవి నుంచి అతన్ని తొలగించి, అర్హులైన నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. అంతేకాక, పున్నా కైలాష్‌పై పోలీసు కేసు నమోదు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి లేఖ రాసినట్లు సమాచారం.

మరోవైపు, కాంగ్రెస్‌లోని బీసీ వర్గాలు మాత్రం కోమటిరెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక బీసీ నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఎదగడాన్ని కోమటిరెడ్డి సహించలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి తమ్ముడిని ముందుగా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు
జిల్లాలో కోమటిరెడ్డి అన్నదమ్ముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.వారికి నచ్చని నాయకులు ఎదగకుండా అడ్డుకోవడం, పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యతిరేక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో సీఎం సన్నిహితుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విషయంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కక్ష గట్టారని ఆరోపణలు ఉన్నాయి.అగ్రకుల అహంభావంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా కొంతమంది నాయకుల నుంచి వెలువడుతున్నాయి.

జిల్లా కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత
డీసీసీ నియామకంపై మొదలైన ఈ వివాదం ఇప్పుడు నల్లగొండ కాంగ్రెస్‌లో పెద్ద రాజకీయ చర్చగా మారింది. పార్టీ హైకమాండ్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో, డీసీసీ పదవిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.
 

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు