Breaking News

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు?.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Published on Thu, 04/11/2024 - 12:20

సాక్షి, నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్లే కాదు మరో పదేళ్లు రేవంత్‌ రెడ్డి  సీఎంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు లేరని స్పష్టం చేశారు. తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. అందరం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టించిందే బీజేపీ పార్టీ అని మండిపడ్డారు. కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు.

ఈ మేరకు నల్లగొండలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళితున్ని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్‌ఎస్‌ అని దుయ్యబటారు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదన్న హరీష్‌రావు మాటల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో అయిదు గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి అనడం తప్పని అన్నారు. బీఆర్ఎస్.. హరీష్‌ రావు, మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడాలని, కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న  మాటలు బంద్‌ చేయాలని అన్నారు.

‘ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. బండి సంజయ్‌ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు సీట్లో కూర్చోబెట్టారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా?. 39 సీట్లకే పరిమితం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు జ్ఞానోదయం కావట్లేదా?. ప్రతిపక్ష నేతలు విజ్ఞతతో మాట్లాడాలి. లోక్‌సభ ఎన్నికల్లో  కాంగ్రెస​ 14 సీట్లను గెలవబోతుంది’ అని తెలిపారు.
చదవండి: Congress: కాంగ్రెస్‌లో ఆ ముగ్గురు ఎవరు? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)