Breaking News

కాంగ్రెస్‌ గెలుపు ఖాయం.. తొలి సంతకం ఫైల్‌ అదే: కోమటిరెడ్డి

Published on Sat, 08/12/2023 - 16:39

సాక్షి, యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తొలి సంతకం రూ.2లక్షల రుణమాఫీ పైనే చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, నాలుగు వేల పింఛన్‌ అందిస్తామని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోంది. ఆగస్టు నెలాఖరుకు కాంగ్రెస్‌ బస్సు యాత్ర చేపడతాం. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలంతా పర్యటిస్తాం. ఎన్నికలపై సర్వేలన్నీ కాంగ్రెస్‌ గెలుస్తోందని చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చాలా బలంగా ఉంది.. ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకం ఉంది. భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాను. 

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను వాయిదా వేయమంటే వేయడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తాం. వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు. 24 గంటల కరెంట్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలే. లాగ్‌ బుక్స్‌తో అన్నీ బయటపెట్టాను. మరోసారి సబ్‌ స్టేషన్‌ దగ్గర ధర్నాకు దిగుతాను. దెబ్బకు కేసీఆర్‌ దిగి రావాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్‌ ఇస్తాం. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారు. 50వేల కోట్లు మద్యం అమ్మకాల మీదే వస్తున్నాయి. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయి’ అని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: ‘కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. కేటీఆర్‌’


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)