Breaking News

రేవంత్‌, ఠాక్రేతో ముగిసిన కోమటిరెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే?

Published on Fri, 01/20/2023 - 20:44

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది కాలం తర్వాత కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు. 

వీరి భేటీ అనంతరం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌ ఎదుట వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో గౌరవం దక్కాలి. అందరి సమిష్టి నిర్ణయాలు ఉండాలి. ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పనిచేస్తాను అని చెప్పాను. కాంగ్రెస్‌ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఉంది. రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని ప్రజల మనసులో ఉంది. హాత్‌ సే జోడో యాత్ర ఎలా చేయాలనే అంశంపై చర్చించాము. 

అంతర్గత విషయాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌ పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరాను. 50 శాతం టికెట్స్‌ ముందే ఇవ్వాలని సూచించాను. గాంధీభవన్‌కు రావడం తగ్గించి నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం ఉండాలి. ఇన్‌ఛార్జ్‌ కూడా జిల్లాల వారీగా తిరగాలని చెప్పాను. నియోజకవర్గాల్లో​ ఒకవేళ ఎక్కువ పోటీ ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడాలని సూచనలు చేశాను. జన సమీకరణ చేసి ఉద్యమాలు చేయాలని కోరాను. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా ఎదుర్కోవాలో చర్చించినట్టు తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40-50 సీట్లు వస్తాయి. నాకు, రేవంత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్‌ బలమైన పార్టీ. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై పోరాడుతాము అని స్పష్టం చేశారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)