Breaking News

కాంగ్రెస్‌లోకి మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి?

Published on Mon, 10/23/2023 - 10:09

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం. అయితే, కోమటిరెడ్డి పార్టీ మారతాడంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ కోరేందుకు రాజగోపాల్‌రెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధులు సంప్రదించగా, పార్టీ మార్పు వార్తలు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు.

బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనకు ఆఫర్‌ ఉందని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

కాగా, రాజగోపాల్‌ రెడ్డి ఈ నెల 27న ఢిలీలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ చేరే అవకాశం ఉందని, మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. గతంలో మనుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్‌ హైకమాండ్‌తో మంతనాలు జరిపిన రాజగోపాల్‌రెడ్డికి ఆ పార్టీ నుంచి  గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లు తెలిసింది.
చదవండి: బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 36% సీట్లు

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)