Breaking News

నా టార్గెట్‌ నెరవేరింది.. కానీ, కేసీఆర్‌ మాత్రం: రాజగోపాల్‌ రెడ్డి

Published on Fri, 07/12/2024 - 18:40

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తన ఏకైక లక్ష్యం నెరవేరిందన్నారు మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణలో జైలుకు వెళ్లే నేతలను తాము కాంగ్రెస్‌లో పార్టీలో చేర్చుకోము అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

కాగా, నేడు(శుక్రవారం) కాంగ్రెస్‌ నేతలు కురియన్‌ కమిటీని కలిశారు. అనంతరం, ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ..‘కురియన్‌ కమిటీని కలిశాను. పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని అడిగారు. భువనగిరి ఇంఛార్జ్‌గా భారీ మెజార్టీతో గెలిపించానని చెప్పాను. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందనే టాక్‌ ఉంది. కానీ, నేను ఇంఛార్జ్‌గా వెళ్లిన తర్వాత కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక అభ్యర్థి అందరం కలిసికట్టుగా పనిచేశాము. రెండు లక్షల మెజార్టీ వచ్చిందని చెప్పాను అని అన్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై ‍స్పందిస్తూ.. తెలంగాణలో నా ఏకైక లక్ష్యం నెరవేరింది. నాకు ఇంకో లక్ష్యం ఉంది.. కేసీఆర్‌ను జైలుకు పంపడమే. బీఆర్‌ఎస్‌ సమాధి అయ్యింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే. బీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీ. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌లో అందరికీ స్వేచ్చ ఉంటుంది. బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ ఉండరు. హరీష్‌ రావు బీజేపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాడు. జగదీష్‌ రెడ్డిని మేము కాంగ్రెస్‌లో చేర్చుకోము. ఆయన జైలుకు వెళ్లే వ్యక్తి. జైలుకు వెళ్లే వారిని ఎవరిని మేము కాంగ్రెస్‌లో చేర్చుకోము’ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)