Breaking News

కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. షర్మిల మౌనం!

Published on Fri, 08/11/2023 - 21:21

హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే కాంగ్రెస్‌ కీలక నేతలతో భేటీ కావడం.. రాహుల్‌ గాంధీకి బర్త్‌డే విషెస్‌తో పాటు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడం.. తాజాగా హస్తిన పర్యటనతోనూ దాదాపుగా సంకేతాలు ఇచ్చేశారు. ఈ క్రమంలో.. తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే లాభమే జరుగుతుందని చెబుతూనే.. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. 

వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడడంతో.. హైదరాబాద్‌ చేరుకున్న ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో షర్మిల సైతం ఆయన వెంట ఉండడం గమనార్హం. ‘‘షర్మిల తెలంగాణకు వస్తే తప్పేంటి?. బీఆర్‌ఎస్‌ పేరుతో కేసీఆర్‌ మహారాష్ట్రకు వెళ్లారు కదా!. షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం. వైఎస్సార్‌ కూతురిగా ఆమెకు ఎప్పుడైనా కాంగ్రెస్‌లోకి ఆహ్వానం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసింది. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే లాభమే జరుగుతంది. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400 ఓట్లు వచ్చినా లాభమే. ఒకరినొకరు కలుపుకుని బలపడాలన్నది కాంగ్రెస్‌ ఉద్దేశం. అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీది’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. 

షర్మిల మౌనం.. మరోవైపు ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల. ఈ క్రమంలో కోమటిరెడ్డితో పాటు ఉన్న ఆమెను మీడియా స్పందన కోరగా.. ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే.. ఢిల్లీ పరిణామాలపై తర్వాత ఆమె ప్రెస్‌ మీట్‌ పెట్టే అవకాశాలున్నాయని ఆమె వర్గీయులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి:మంత్రి శ్రీనివాసగౌడ్‌పై కోర్టు ఆగ్రహం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)