Breaking News

జూన్‌ 4 తర్వాత బాబును తలుచుకునే వారెవరూ ఉండరు: కొడాలి నాని

Published on Wed, 03/27/2024 - 15:41

సాక్షి, కృష్ణా: అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైన పట్టుకుంటాడని మండిపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు ఒంటరిగాపోటీ చేస్తే గెలవలేమని తెలిసి పవన్‌, బీజేపీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. జూన్‌ 4 తర్వాత చంద్రబాబును తలుచుకునే వారెవరూ ఉండరని అన్నారు.

గుడివాడ ఒకటవ వార్డు నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నాగవరప్పాడులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడివాడలో అయిదవసారి తానే గెలవబోతున్ననని తెలిపారు. ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంతమంది వచ్చినా వైఎస్సార్‌సీపీ తరపున హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు.

గుడివాడ టీడీపీ అడ్డా...గాడిద గుడ్డు.. అంటూ చంద్రబాబు సొల్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ‘నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌కు ఇదే నా సవాల్‌.  చంద్రబాబు, లోకేష్ గుడివాడలో తన పై పోటీ చేసి గెలవాలి. టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది. నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని...పూటకో వ్యక్తిని తెచ్చే బతుకులు టీడీపీవి. 

ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు. వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు. చంద్రబాబు ఎంత 420నో చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం’ అని పేర్కొన్నారు.
చదవండి: Memantha Siddham Day-1: మేమంతా సిద్ధం డే-1 అప్‌డేట్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)