Breaking News

ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది: కేకే ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Thu, 07/04/2024 - 20:01

న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న తర్వాతిరోజు సీనియర్‌ నేత కే కేశవరావు బీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా ఉన్నాయి. 

కాంగ్రెస్ నా సొంత ఇల్లు. నేను కాంగ్రెస్ మనిషిని. తిరిగి పార్టీలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా కూడా ఉంది. నైతిక విలువలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇదే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ కూడా అదే చెప్పాను అని అన్నారాయన. అలాగే.. 

తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనపైనా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కాంగ్రెస్‌ ఎంపీల పోరాటం వల్లే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక పాలన ప్రజాస్వామ్య బద్దంగా ఉంది. ఆరు నెలల్లో ఎవరిని కూడా అంచనా వెయలేం. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవాళ్లు. కానీ, ఈ ఆరు నెలల్లో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలనే చూశా అని అన్నారు. 

కేకేకు ప్రత్యేక సలహాదారు పదవి?
రెండేళ్ల పదవీకాలం ఉండగానే కేకే రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో ఆ సీటు మరొకరికి దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే త్వరలో కేకేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక  సలహాదారు పదవి దక్కవచ్చనే ప్రచారం ఒకటి మొదలైంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)