Breaking News

‘రేవంత్‌రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పని చేయలేదు’

Published on Sat, 11/23/2024 - 16:25

హైదరాబాద్‌: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కేంద్ర  మంత్రి   కిషన్‌రెడ్డి   పేర్కొన్నారు.   రాహుల్‌ గాంధీ   దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకతో ఉందో తాజా ఫలితాల్ని బట్టి అర్థమవుతోందన్నారు కిషన్‌రెడ్డి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా   రాలేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో విపక్షహోదా కూడా కాంగ్రెస్‌కు రాలేదని కిషన్‌రెడ్డి   విమర్శించారు.

‘రేవంత్ రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పనిచేయలేదు. ఆయన తెలంగాణ ప్రజల డబ్బును మహారాష్ట్రకు పంపించినా పనిచేయలేదు. తెలంగాణలో రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై కోపంతో వారు పోవాలని, అలాగే అబద్ధపు 6 గ్యారెంటీల కారణంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయం.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసింది.

అయినా ప్రజలు వారిని తిరస్కరించారు.మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఈ 5 నెలల్లో తిరిగి ప్రజలు ఆలోచించి పూర్తిస్థాయిలో ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపారు’ అని కిషన్‌రెడ్డి   స్పష్టం చేశారు.

	Kishan Reddy: బీజేపీపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేశారు
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)