Breaking News

దేశ సమైక్యతకు బీజేపీ పనిచేస్తుంది

Published on Mon, 06/24/2024 - 05:35

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సమగ్రత, సమైక్యత కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రమాదకరమైన ఆర్టికల్‌ 370ని విభేదించిన డాక్టర్‌ శ్యామప్రసాద్‌ ముఖర్జీ అప్పట్లో కేంద్రమంత్రి పదవి కి రాజీనామా చేశారని, తర్వాత భారతీయ జనసంఘ్‌ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆర్టికల్‌ 370కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని వివరించారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు బలిదానం చేసిన చరిత్ర జనసంఘ్‌దన్నారు.

శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్‌ దివస్‌ను పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నా లు ఉండకూడదనే నినాదంతో ఆర్టికల్‌ 370 రద్దు కోసం ముఖర్జీ ఉద్యమించారని, అప్పట్లో దేశంలో జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం ఉంటే, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండేదన్నారు.

75 ఏళ్ల తర్వాత దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ముఖర్జీ లక్ష్యం నెరవేరిందన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌లో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డాక్టర్‌ విజయ రామారావు, యెండల లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్‌ తివారీ, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, ఆకుల విజయ తదితరులు ఈ కార్యక్రమంలో శ్యామప్రసాద్‌ ముఖర్జీకి నివాళులర్పించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)