Breaking News

తమాషాలొద్దు..

Published on Thu, 07/27/2023 - 01:54

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన నిజామాబాద్‌ జిల్లా పార్టీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తనదైన శైలిలో క్లాస్‌ పీకారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప మీడియా ఎదుట నిరసనలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, తమాషాలొద్దు... అని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు.

నిజామాబాద్‌ జిల్లాలో బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ జిల్లా  అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా..  కొత్తవారిని ప్రకటించడంపై మరో వర్గం రగిలిపోయింది. ఎంపీ అర్వింద్‌ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని ఈ వర్గం ఆరోపిస్తోంది.

ఈక్రమంలో బుధవారం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గాలకు చెందిన అసమ్మతి నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అసమ్మతి నేతలను పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆందోళన చేయడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్‌ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్‌ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్‌ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.

ఆ జిల్లాలో అన్ని సెగ్మెంట్లలోనూ పోటాపోటీ
నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని  నియోజకవర్గాల్లోనూ ఇప్పటి నుంచే టికెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. నిజా మాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య  పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఎంపీ అర్వింద్‌ ప్రోత్సాహంతో ధన్‌పాల్‌ సూర్యనారా యణ గుప్త కూడా అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్‌ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్‌ రెడ్డితో పాటు పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్‌రెడ్డి అక్కడ బీజేపీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఇక బోధన్‌ నియోజకవర్గం నుంచి ప్రకాశ్‌రెడ్డితో పాటు రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది.

అయితే మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంతమంది అసమ్మతి వర్గా నికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాల యానికి చేరింది. కాగా, ఎంపీ అర్వింద్‌ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)