Breaking News

రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు

Published on Wed, 11/20/2024 - 01:13


సాక్షి, న్యూఢిల్లీ: అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంలో మత పరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని... ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్నట్టుగానే మహారాష్ట్రలో కూడా 4శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ వరిష్ట్‌ ప్రచారక్‌ నందకుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేశాయని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పాయని గుర్తు చేశారు.

దీనిపై సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు..ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టు తీర్పు ఇచి్చందని తెలిపారు. ఆ కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గౌరవించాలని సూచించారు. లగచర్ల అంశంపై చట్టం తనపని తాను చేస్తుందని, ఇది ముఖ్యంగా శాంతిభద్రతల సమస్య అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. హిందూ దేవాలయాల్లో పనిచేసే ఇతర మతాల వారిని వేరేచోట్లకు బదిలీ చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)