Breaking News

పెద్దల సమక్షంలోనే.. రసాభాసగా ఖమ్మం కాంగ్రెస్‌ సమావేశం

Published on Tue, 09/12/2023 - 19:13

సాక్షి, ఖమ్మం:  జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో గ్రూప్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్‌ భారీ ఎత్తున తుక్కుగూడలో(రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో) బహిరంగ సభకు సిద్ధమవుతోంది. అయితే ఈ సభకు సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయగా.. అది రసాభాసకు దారి తీసింది. సీనియర్‌ నేత వీహెచ్‌ మాట్లాడే సమయంలో కార్యకర్తలు అడ్డుపడడంతో.. ఆయన వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఖమ్మంలో తుక్క​గూడ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్‌తో పాటు వీ హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నియోజకవర్గ ఇంఛార్జిలు, కొందరు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే వీహెచ్‌ మాట్లాడే సమయంలో కొందరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జిల్లాలో మీ కో అర్డినేషన్ ఏమిటి? అంటూ వీహెచ్పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీహెచ్‌ సైతం కౌంటర్‌గా వాళ్లపై మండిపడ్డారు.  దీంతో.. అరుపులు కేకలు వేసిన కార్యకర్తలపై వీహెచ్‌ అసహనం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో కార్యకర్తలు ఎవరికి వారే..  ‘జై పొంగులేటి’, ‘జై రేణుకా చౌదరి’, ‘జై భట్టి’.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశం గందరగోళంగా తయారైంది. 

పెద్దల్ని గౌరవించండి
మనలో మనం కొట్టుకుంటే పార్టీకే నష్టమంటూ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పొంగులేటి, రేణుకాచౌదరి. పార్టీ పెద్దలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ లో గ్రూప్ గొడవలు ఉండొద్దు. అందరం కలిసి పని చేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పది కి పది స్థానాలు గెలుస్తామన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  

‘‘నాకు చేదు నిజం చెప్పే అలవాటు ఉంది. నలభై ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన  కొంతమంది నాయకులకు గౌరవం దక్కట్లేదు.  పార్టీ కోసం పని చేసిన నేతలకు న్యాయం జరగాలి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. ఖబర్దార్ అజయ్ కుమార్(మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఉద్దేశించి).. దమ్ముంటే రా.  పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకు. గాలి మారిపోయింది.  రాబోయేది కాంగ్రెస్.. ఉండబోయేది కాంగ్రెస్.. గుర్తుంచుకో. కేసీఆర్, మోదీ తోడు దొంగలు. ఈ విషయం.. కవిత లిక్కర్ కేసుతో రుజువైందని రేణుక చౌదరి మండిపడ్డారు. 
 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)