Breaking News

త్వరలో ఢిల్లీ సీఎం అరెస్టు: కేజ్రీవాల్‌

Published on Wed, 12/25/2024 - 11:35

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(DelhiElections) సమీపిస్తున్న కొద్ది అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. క్రమంలోనే ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvindkejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అతిషి(Atishi)ని త్వరలోనే ఏదో తప్పుడు కేసులో అరెస్టు చేస్తారన్నారు. ఈ మేరకు బుధవారం(డిసెంబర్‌25) ఎక్స్‌(ట్విటర్‌)లో కేజ్రీవాల్‌ ఒక పోస్టు చేశారు.

సీఎం అతిషి ఇటీవల ముఖ్యమంత్రి సంజీవని యోజన,మహిళా సమ్మాన్‌ యోజన పథకాలు ప్రకటించడంతో కొందరు వణుకుతున్నారని అందుకే ఆమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందే పలువురు ఆమ్‌ఆద్మీ పార్టీ కీలక నేతల ఇళ్లలో సోదాలు జరగవచ్చని కేజ్రీవాల్‌ తెలిపారు.

కాగా, ఢిల్లీలో మహిళలకు నెల నెలా రూ.2100 నగదు ఇచ్చే మహిళా సమ్మాన్‌ యోజన స్కీమ్‌ ఏదీ లేదని, స్కీమ్‌ పేరుతో ఎవరైనా ప్రజల సమాచారం సేకరించడం నేరమని ఢిల్లీ మహిళా,శిశు సంక్షేమ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. 

ఓ వైపు ఆమ్‌ఆద్మీపార్టీ ఈ స్కీమ్‌ కింద అర్హుల వివరాలు సేకరిస్తున్న వేళ మహిళా,శిశు సంక్షేమ శాఖ చేసిన ప్రకటన రాజకీయ వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ మరో విధంగా స్పందించింది. కేజ్రీవాల్‌ అతిషి మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆప్‌ స్కీమ్‌పై ప్రభుత్వం చర్యలకు దిగిందని ఆరోపించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మళ్లీ గెలిస్తే మహిళా సమ్మాన్‌యోజనతో పాటు సంజీవని స్కీమ్‌ అమలు చేస్తామని తదితర హామీలిచ్చింది. ఈ స్కీమ్‌లపై బీజేపీ,ఆప్‌ల మధ్య రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి. 

 

 

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)