Breaking News

‘మోదీ’ నినాదాలు చేస్తే.. భోజనం పెట్టమని చెప్పండి: సీఎం కేజ్రీవాల్‌

Published on Sun, 03/10/2024 - 15:41

ఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికలు  సమీపిస్తున్న వేళ విమర్శలు, ప్రతివిమర్శలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)  కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మహిళా సమ్మాన్‌ సమారోహ్‌’ పేరుతో నిర్వహించిన మహిళల సభలో సీఎం కేజ్రీవాల్‌ పాల్గొని ప్రసంగించారు.  

‘చాలా మంది పురుషులు ప్రధాని మోదీ పేరుతో నినాదాలు చేస్తున్నారు. మహిళలు వారి ఆలోచనలు మార్చాలి. మీ(మహిళలు) భర్తలు మోదీ నినాదాలు చేస్తే.. తమకు భోజనం పెట్టమని చెప్పండి’ అని కేజ్రీవాల్‌ అన్నారు. మహిళలు తమ కుటుంబ సభ్యులతో చర్చించి.. ఆప్‌కు తమ మద్దతు ఇవ్వాలని కోరారు.  ముఖ్యంగా బీజేపీకి మద్దతుగా ఉన్న మహిళలకు చెప్పండి.. తమ సోదరుడు(కేజ్రీవాల్‌) మహిళలందరికీ అండగా ఉంటాడని చెప్పాలన్నారు.  

‘వారికి (బీజేపీకి మద్దతు పలికే మహిళలు) చెప్పండి మా ప్రభుత్వం విద్యుత్‌ ఉచితంగా అందజేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇకనుంచి మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నాం. మహిళకు బీజేపీ ఏం చేసింది. అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మహిళలంతా ఈసారి కేజ్రీవాల్‌కే ఓటు వేయండి’ అని  సీఎం  కేజ్రీవాల్‌ తెలిపారు.

‘కొన్ని పార్టీలు మహిళలకు కొన్ని పదవలు ఇచ్చి.. మహిళా సాధికారత కల్పిస్తున్నామని చెబుతున్నాయి. నేను అలా చెప్పను. మహిళలకు పదవుల ఆశ  చూపటం సరికాదు. వాళ్లకు అన్ని అవకాశాలు ఇవ్వాలి.  కేవలం  ఇద్దరూ లేదా నలుగురు మహిళలకు లబ్ధి కలిగించిటం సరికాదు. మరీ మిగతా మహిళలు పరిస్థితి ఏంటి?’ అని కేజ్రీవాల్‌ విమర్శలు చేశారు.

తమ ప్రభుత్వం అందించనున్న ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే పథకమే నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనం అన్నారు. ఇక.. ఇటీవల కేజ్రీవాల్‌ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్‌లో మహిళలకు నెలకు  వెయ్యి రూపాయాలు అందజేస్తామని కేటాయింపులు ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)