Breaking News

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

Published on Tue, 06/04/2024 - 05:51

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ నేతల సన్నద్ధతపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరా తీశారు. సోమవారం పలువురు పార్టీ నేతలకు కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ తరఫున పోలింగ్‌ ఏజెంట్ల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

ఓట్ల లెక్కింపు చివరిరౌండ్‌ పూర్తయ్యే వరకు ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రంలోనే ఉండేలా చూసుకోవాలన్నారు. చాలా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రత్యరి్థగా గట్టి పోటీనిస్తున్నందున ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు ప్రారంభానికి ముందే పార్టీ తరఫున నియమితులైన పోలింగ్‌ ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకునేలా ఎంపీ అభ్యర్థులు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. 

ముగిసిన దశాబ్ది ఉత్సవాలు 
మూడు రోజులపాటు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరి గిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సోమవారం ముగిశాయి. సిరిసిల్లలో  కేటీఆర్‌ జాతీ య జెండాతోపాటు పార్టీ జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, శ్రేణులు ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)