Breaking News

వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

Published on Sat, 03/30/2024 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ తరఫున వరంగల్‌ ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థిని బరిలో దించేదిశగా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. బీఆర్‌ ఎస్‌ అభ్యర్థి కడియం కావ్య  పోటీ నుంచి తప్పుకొని తన తండ్రి కడియం శ్రీహ రితో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తి చెంది, బీఆర్‌ ఎస్‌ అధికారం కోల్పోగానే  పార్టీకి దూరమైన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో బీఆర్‌ఎస్‌ వర్గా లు సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిసింది. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజ య్య చెప్పినట్టు సమాచారం.

ఓ వైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్‌ అన్వేషిస్తున్నట్టు సమా చారం. పార్టీ తరపున టికెట్‌ ఆశించిన బోడ డిన్న, నిరంజన్, జింక రమేశ్‌ తదితరులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు హనుమ కొండ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇదిలాఉంటే తన అను చరులతో కడియం శ్రీహరి శనివారం హైదరాబా ద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కూడా స్టేషన్‌ఘనపూర్‌ నేతలతో నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)