Breaking News

BRS: వరంగల్‌ ఎంపీ అభ్యర్థి.. ట్విస్ట్‌ ఇచ్చిన కేసీఆర్‌

Published on Fri, 04/12/2024 - 17:50

సాక్షి,హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హన్మకొండ జెడ్పీ చైర్మన్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం( ఏప్రిల్‌ 12)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వరంగల్‌ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో శుక్రవారం భేటీ అయ్యారు.

ఈ భేటీకి ఇటీవలే పార్టీని వీడిన స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్‌ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఒక దశలో ఊపందుకుంది. చివరకు సుధీర్‌కుమార్‌ను బరిలోకి దింపాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వరంగల్‌ నుంచి ఇప్పటికే  బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్‌ఎస్‌ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, ప్రస్తుతం వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొం‍ది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్‌ఎస్‌ను ఇటీవల వీడి టికెట్‌ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్‌ఎస్‌కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, కాంగ్రెస్‌ నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ కడియం కావ్య బరిలో ఉన్నారు. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. కడియం

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)