Breaking News

అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా.. కన్న తండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్‌

Published on Tue, 07/23/2024 - 19:22

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్‌ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్‌ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)