Breaking News

గన్‌పార్క్‌ వద్ద క్షమాపణలు చెప్పిన కవిత

Published on Sat, 10/25/2025 - 11:24

సాక్షి, హైదరాబాద్‌: ఇన్నేళ్ల తన రాజకీయంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని.. అందుకు ఆ కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి తరఫున శనివారం జనం బాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అంతకంటే ముందు.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించాక ఆమె మీడియాతో మాట్లాడారు. 

‘‘తెలంగాణ అమరవీరుల కుటుంబాలను నేను క్షమాపణలు కోరుతున్నా. గతంలో నేను గట్టిగా కొట్లాడలేకపోయా. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా. నా జాగృతి జనం బాటలో అందరినీ కలుస్తా. 33 జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాలను కలుస్తా’’ అని అన్నారామె. 

తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో? ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పాం. అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయాం. 

ఈ మొత్తంలో 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు,కొన్ని చోట్ల ఎంపీపీ, జెడ్పిటిసి టిక్కెట్లు వచ్చాయి. కానీ ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదు. నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగాను. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేక పోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని  కవిత వ్యాఖ్యానించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)