Breaking News

పవన్‌.. ‘సనాతన ధర్మం అంటే కాషాయ దుస్తులు ధరించడం కాదు’

Published on Fri, 04/18/2025 - 14:15

పల్నాడు జిల్లా,సాక్షి: తిరుమల లడ్డు వ్యవహారంలో కట్టుకథ అల్లి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నెట్టే ప్రయత్నించారు. ఇదే అంశంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

తిరుమల గోశాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయంపై కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరం. గోవులు చల్లగా ఉంటేనే ఈ విశ్వం చల్లగా ఉంటుంది. గోవులు చనిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేంతవరకు విషయం బయటికి రాలేదు.

టీటీడీ ఈవో,ఛైర్మన్ గోవులు చనిపోతున్నాయని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం గోవులు చనిపోవటం లేదని చెబుతున్నారు. తొమ్మిది పది నెలల నుంచి నెలకు 10 నుంచి 15 గోవులు చనిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? గోవుల మరణాలపై చర్చకి సిద్ధమని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

భూమన కరుణాకర్‌రెడ్డి చర్చకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని హడావిడి చేశాడు. సనాతన ధర్మం అంటే కాషాయం బట్టలు వేసుకొని తిరగటం కాదు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.

గతంలో లడ్డు వ్యవహారంలో కట్టు కధ అల్లి రాజకీయం చేసి వైఎస్‌ జగన్‌ మీద వేసే ప్రయత్నించారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు. ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి గోవులు ఎందుకు చనిపోతున్నాయో కారణాలు కనుక్కోండి

గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు 20 వేలుఇస్తానని ప్రకటించారు. ఇప్పటికి 40 వేలు రైతులకి బకాయి ఉన్నారు. చంద్రబాబు రైతులకు ఇస్తానన్న డబ్బులు చెల్లిస్తే వారికి ఎంతో కొంత ఉపయోగపడతాయి’అని సూచించారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)