ఔను.. ‘భోగాపురం’ ఘనత వైఎస్‌ జగన్‌దే

Published on Fri, 07/31/2026 - 16:39

సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్‌ కొట్టేయాలన్న చంద్రబాబు సర్కార్‌ తీరుపై వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పూర్తి చేసి.. అనుమతులు తీసుకొచ్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అయితే, చంద్రబాబుదే క్రెడిట్‌ అంటూ ఆంధ్రజ్యోతి రాతలపై కారుమూరి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీపై ఏబీఎన్‌ రాధాకృష్ణ తప్పుడు రాతలను దుయ్యబట్టారు.

వైఎస్సార్‌సీపీ ‘భోగాపురం’ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంటూ ఎల్లో మీడియా రాతలపై కారుమూరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తే 2019 కంటే ముందే మీరు కట్టేయొచ్చుగా.. విమానాశ్రయానికి సంబంధించి ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేయటమే తప్ప ఏ ప్రాజెక్టుని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు.. ఆ ప్రాజెక్టులను వదిలేస్తాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? ఏం అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? రాధాకృష్ణ సమాధానం చెప్పాలి కదా?

..2200 ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను భోగాపురంలో కట్టాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టులో పెండింగ్‌ కేసులను పరిష్కరించి.. అక్కడ నాలుగు గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించి కాలనీలు నిర్మించింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భూసేకరణ చేసి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ తీసుకొచ్చింది. 2023 మే 3న వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు.

..విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించారు. నేడు భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయిందంటే అది వైఎస్‌ జగన్‌ ముందు చూపు వల్లే.. ఆ విషయం గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసిన ప్రజలకు వాస్తవాలు తెలుసు’’ అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

 

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)