Breaking News

ఈనాడు టిష్యూ పేపర్‌గానే పనికొస్తుంది: మంత్రి కారుమూరి 

Published on Thu, 06/08/2023 - 14:54

సాక్షి, ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించాడు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాల శాఖలో రూ.20వేల కోట్లు అప్పు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పౌర సరఫరా శాఖలో అనేక మార్పులు తెచ్చారు. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా చేశారు. 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈనాడు టిష్యూ పేపర్‌గానే పనికొస్తుంది. చంద్రబాబులాగే ఈనాడు రామోజీ కూడా రూ.వేలాది కోట్లు డైవర్ట్‌ చేశారు. టీడీపీ హయాంలో వేలాది కోట్లు డైవర్ట్‌ చేస్తే నోరు మెదపలేదు. 

ప్రభుత్వంపై బురద చల్లడానికి ఈనాడు అసత్య కథనాలు రాస్తోంది. చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించాడు. ఒక ఎకరం ఉన్న రైతు వద్ద  కూడా మేము ధాన్యం కొనుగోలు చేశాం. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలకి డబ్బు జమ చేశారు. బాబు హయాంలో దళారులు దోచుకున్నారు. ఈనాడు వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి. మీరు ఎన్ని చేసినా 175కు 175 స్థానాల్లో మా ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు.. జెండా ఊపి ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్‌

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)