ముహూర్తం ఫిక్స్‌.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే?

Published on Wed, 05/17/2023 - 12:35

సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా కానీ, సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే, ఎట్టకేలకు బుధవారం.. ఉత్కంఠకు తెరపడింది. సిద్ధూకు ఒకే అన్న కాంగ్రెస్‌ అధిష్టానం.. మరికాసేపట్లో ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

కాగా, ముందుగా ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య.. ఖర్గేతో మంగళవారం ఓ దఫా చర్చలు జరిపారు. నిన్న ఉదయం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లి ఖర్గేతో సమావేశమై చర్చలు జరిపారు. నిన్న మల్లికార్జున్ ఖర్గే నివాసంలో నిరంతరం సమావేశాలు, చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు.

కాగా, రాహుల్‌ గాంధీతో సిద్దరామయ్య బుధవారం సమావేశమయ్యారు. అరగంట పాటు రాహుల్‌తో చర్చించారు. సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్‌ హైకమాండ్‌ మొగ్గు చూపుతున్నట్లు మధ్యాహ్ననికి క్లారిటీ రాగా, సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రొటేషన్‌ సీఎం ఫార్ములాను కాంగ్రెస్‌ హైకమాండ్‌ సూచిస్తోంది. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. రాహుల్‌గాంధీని డీకే శివకుమార్‌ కూడా కలిశారు. కర్ణాటక సీఎం అభ్యర్థిపై అధిష్టాన నిర్ణయాన్ని డీకేకి రాహుల్‌ తెలిపారు.
చదవండి: కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే!

రేపు(గురువారం) సాయంత్రం బెంగుళూరులో సీఎల్పీ భేటీ జరగనుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ఇంటి దగ్గర భద్రత పెంచారు. రేపు ప్రమాణస్వీకారం ఉంటుందని సిద్ధూ అనుచరులు అంటున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)