Breaking News

కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్‌.. తెలంగాణపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌.. ఢిల్లీలో ఈటల!

Published on Tue, 05/16/2023 - 11:24

కర్ణాటక ఫలితాలు బీజేపీకి గట్టి షాక్‌ ఇచ్చాయనే చెప్పాలి. దక్షిణాదిపై పట్టు కోసం కాషాయ పార్టీ గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో మరోసారి అధికారం చేజిక్కించుకోవడంతో పాటు తెలంగాణపై పట్టు కోసం ప్రణాళికలు రచించింది. కర్ణాటక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే.. తెలంగాణలో మారుతున్న రాజకీయ వాతావరణం తమకు మరింత కలిసొస్తుందని కేంద్రం భావించింది. అయితే, అనూహ్యంగా కర్ణాటక చేజారడంతో కమలనాథులు ప్లాన్‌ మార్చినట్లు తెలుస్తోంది.

ఫోకస్‌ అక్కడే..
బీజేపీ హైకమాండ్‌ దక్షిణాదిలో తెలంగాణను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే ప్రస్తుత ఫోకస్‌ తెలంగాణపై పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆపరేషన్ ఆకర్ష్పై నేరుగా రంగంలోకి దిగింది. ఇదిలా ఉండగా హస్తినలో ఈటెల రాజేందర్ తిష్ట వేయగా, అగ్రనాయకులను నేరుగా పొంగులేటితో మాట్లాడించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పార్టీలో కీలకమార్పులు ఉంటాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కర్ణాటక ఫలితాల దెబ్బతో తెలంగాణ బీజేపీలో సమీకరణాలు మారునున్నాయని తెలుస్తోంది.

ఇకపై ఆ తప్పులు చేయకూడదు
కర్ణాటక ఎన్నికల ఓటమి నుంచి బీజేపీ పెద్దలు గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. తమ లోపాల గురించి ఆలోచించడంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయ పార్టీ వ్యూహాన్ని పునరాలోచిస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభ్యర్థులను, ప్రాంతీయ నాయకత్వాన్ని నిర్ణయించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆచితూచి వ్యవహరించాలని అగ్ర నాయకత్వం నిర్ణయించుకుంది.

కర్ణాటకలో బీఎస్ యడియూరప్పను తొలగించడం, లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సదవి వంటి సీనియర్ నాయకులకు టిక్కెట్లు నిరాకరించడం వల్ల అక్కడ భారీగా నష్టపోయిందని పార్టీ గ్రహించింది. అందుకే ఈ సారి అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు కూడా బీజేపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: మహారాష్ట్ర సర్కార్‌కు ముప్పు లేదు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)