కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీలోకి కీలక నేతలు!

Published on Wed, 09/03/2025 - 09:31

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. పలువురు కీలక నేతలు అధికార కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలోనే నేతలు వ్యతిరేక గళం వినిపిస్తున్నారని తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వర్గీయుల రాజకీయాలు యూటర్న్‌ తీసుకుంటున్నాయి. ఇరువురి మద్దతుదారులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేఎన్‌ రాజన్న బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ రాజేంద్ర మాట్లాడుతూ.. బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత(డీకే శివకుమార్‌) వెంట వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పేరు ప్రస్తావించకుండానే రాజేంద్ర పలు విమర్శలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న పదవి పోవడం వెనక కొందరి ‘రహస్య హస్తం’ ఉంది.  కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌ వల్లే పదవి దక్కింది. చివరివరకు అందులోనే కొనసాగుతాము అని వెల్లడించారు. ఇదే సమయంలో రాజన్న అసెంబ్లీలో ఆరెస్సెస్‌ గీతం పాడలేదని, చిన్నప్పటి నుంచి ఆయనకు ఆరెస్సెస్‌ శాఖల గురించి తెలియదని పరోక్షంగా డీకేకు చురకలంటించారు. రాజన్న సొంత భావజాలంతో పని చేసే వ్యక్తి అని కొనియాడారు.

డీకే శివకుమార్‌ విధేయుడు హెచ్‌సీ బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ.. మంత్రిగా రాజన్న ప్రవర్తన, వాడిన భాష ఆయన పతనానికి కారణమని విమర్శించారు. పదవి పోవడం వెనక ఎలాంటి కుట్ర లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని సంచలన ఆరోపణలు చశారు. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)