Breaking News

ఆమెకు వంట మాత్రమే తెలుసు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Sat, 03/30/2024 - 10:57

బెంగళూరు: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తత ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. గాయత్రి సిద్దేశ్వర ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోండి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. మీకు మాట్లాడటం తెలియదు. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసు. ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా మాట్లాడే శక్తి లేదు" అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శివశంకరప్ప తనపై చేసిన వ్యాఖ్యలపై గాయత్రి సిద్దేశ్వర స్పందిస్తూ.. ప్రస్తుతం మహిళలు అన్నింటా రాణిస్తున్నారని, కానీ మహిళలు వంటింట్లోనే ఉండాలి అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఇంట్లోని మగవాళ్లకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదన్నారు. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)