Breaking News

అయ్యో సిద్ధా.. మీడియా ముందు భంగపాటు!

Published on Thu, 01/25/2024 - 14:03

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మీడియా ముందు భంగపాటు ఎదురైంది. బుధవారం ఓ నీటి ప్రాజెక్టు పనుల ప్రారంభం కోసం వెళ్లిన ఆయనకు అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఆగ్రహం తెప్పించింది.  అయితే అక్కడ సంయమనం పాటించి మౌనంగా ఆయన.. తర్వాత చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. 

బుధవారం పెరియాపట్నలో ఓ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియా ముందు.. మోటర్‌ స్విచ్‌ ఆన్‌ చేయగా అది పని చేయలేదు. దీంతో ఆయన పక్క ముఖాలు చూశారు. అయినా పక్కనున్నవాళ్లు అదేం పట్టించుకోకుండా చప్పట్లు కొట్టారు. అయితే.. అది పని చేయడం లేదని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో అధికారులు ఎంత ప్రయత్నించినా.. అది ఆన్‌ కాలేదు. చివరకు బటన్‌ ఫెయిల్‌ అయ్యిందని.. సాంకేతిక సమస్య తలెత్తిందని.. అందుకే అది పని చేయలేదని గుర్తించారు. 

అయితే ఆ కార్యక్రమం తర్వాత ఆయన సంబంధిత అధికారుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఈ ఉదయం చాముండేశ్వరీ ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్‌(సీఈఎస్‌సీ) ఎండీ సీఎన్‌శ్రీధర్‌ను సస్పెండ్‌ చేస్తూ పీఎస్‌(ప్రిన్సిపల్‌ సెక్రెటరీ) ఉమాదేవి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. సౌకర్యాల రూపకల్పనలో విఫలం కావడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Video Credits: Mirror Now

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)