Breaking News

Karnataka: రాజీనామా వార్తలపై డీకేఎస్‌ సీరియస్‌

Published on Tue, 05/16/2023 - 16:48

సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి విషయంలో తేడాలు జరిగితే కాంగ్రెస్‌కు డీకే శివకుమార్‌ రాజీనామా చేస్తారనే ప్రచారం ఒకటి కన్నడ మీడియా ఛానెల్స్‌ ద్వారా చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ప్రచారంపై డీకేఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని మీడియా ప్రతినిధులకు వార్నింగ్‌ ఇచ్చారాయన. 

పార్టీ(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) నాకు తల్లిలాంటిది. పార్టీకి రాజీనామా చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేనెందుకు రాజీనామా చేస్తా. అలాంటి ప్రచారం చేసేవాళ్లపై దావా వేస్తా జాగ్రత్త. 135 ఎమ్మెల్యే మద్దతు నాకు ఉంది అని ఢిల్లీలో తనని పలకరించిన మీడియా ప్రతినిధులతో తెలిపారాయన. 

ఢిల్లీలో కన్నడ సీఎం ఎంపిక ఎపిసోడ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉదయం నుంచి కీలక నేతలు చర్చోపచర్చలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై చర్చించారు. ఇక సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వేర్వేరుగా ఈ సాయంత్రం ఖర్గేతో భేటీ కానున్నారు.

తొలుత ఐదు గంటల ప్రాంతంలో డీకే శివకుమార్‌, ఆపై ఆరు గంటలకు సిద్ధరామయ్య ఖర్గేతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటుపై ఇద్దరూ రాహుల్‌ గాంధీతోనూ భేటీ కావొచ్చని తెలుస్తోంది. అంతా సజావుగా జరిగితే.. ఇవాళ రాత్రికే కర్ణాటక సీఎం ఎవరూ అనేదానిపై ఒక ప్రకటన వెలువడొచ్చని, ఉత్కంఠ వీడొచ్చని అటు కాంగ్రెస్‌ శ్రేణులు ఇటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇదీ చదవండి: సీఎం ఎంపిక కోసం వాళ్ల లాబీయింగ్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)